About us/మా గురించి
నాపేరు ఆదిత్య శిరీష్ రూపాకుల నేను అనేక వ్యాపారాలు చేసి ఉద్యోగాలు చేసి దేనిలోను తృప్తి చెందక చివరికి భగవంతుడే శరణ్యము ధర్మమే నిజమైన మార్గము అని భావించి నా ఆధ్యాత్మిక ప్రయాణము ఐన వెలుగు వైపు ప్రయాణము అనే channel ప్రారంభించి అనేక లక్షల మందితో నా అధ్యాత్మిక ప్రయాణమును కొనసాగిస్తున్నాను. విద్యాభ్యాసము ముగించుకున్న అనంతరము 1995 ప్రాంతములో కంప్యూటర్ విద్య ప్రారంభములోనే అందరికి అందుబాటులో విద్యను అందించాలి అన్న సంకల్పముతో “Center for Training in Computers” అన్న computer training Instute ప్రారంభించి అనేక మందికి computer software లో నిష్ణాతులుగా చేయటం జరిగింది. దీనిద్వారా ఎంతోమంది విదేశములలో స్థిరపడినారు. తదనంతరము “sree Aditya Enterprises” అనే సంస్థను స్థాపించి దీనిద్వారా ఎన్నో వేల సంస్థలకి “computer consumables and computer Stationery” సప్లయ్ చేసి ఆర్దికముగా స్ఠిరపడినాను. తదనంతరము 7 సంవత్సరములు ప్రముఖ Pvt Ltd company లో Human resorce Head గా ఉద్యోగము చేసి . ఉద్యోగరీత్య తృప్తి చెందక ఆధ్యాత్మిక ప్రయాణము ప్రారంభించినాను

Anchor, Content Writer, Business Women
నా పేరు దుర్గా భవాని రూపాకుల నేను వొక సాధారణ మధ్యతరగతికి చెందిన బ్రాహ్మణ యువతిని. విద్యాభ్యాసం ముగిసిన తరువాత మా తల్లి తండ్రుల కోరిక ప్రకారం నా వివాహము ఆదిత్య శిరీష్ గారితో జరిగినది . నేను వొక స్ఠిరమైన ఉద్యోగిని వివాహము చేసుకొని జీవితంలో సంతోషముగా ఉండాలి అని ఆలోచించిన వ్యక్తిని. కాని భగవంతుని ఆలోచన ప్రకారం వ్యాపారం లో స్ఠిరపడిన వ్యక్తితో నా వివాహం జరిగినది . వివాహము తరువాత నేను గృహిణిగా ఉండటం ఇష్టం లేక నా భర్తకి వ్యాపారం లో సహకరించి ఆ వ్యాపారం అభివృద్ధికి నా వంతు ఎంతో దోహదం చేసినాను. మేము ఇద్దరం కలసి ఆధ్యాత్మిక ప్రయాణము ప్రారంభించి వెలుగు వైపు ప్రయాణం అనే channel ముందుకు తీసుకుని వెళుతున్నాము .
